విచారణలో అల్లు అర్జున్ ఎదుర్కున్న ప్రశ్నలు

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి విచారణకు హాజరైన అల్లు అర్జున్ ను దాదాపుగా నాలుగు గంటలపాటు విచారించారు పోలీసులు. అయితే పోలీస్ విచారణలో అల్లు అర్జున్ ను పోలీసులు ఎలాంటి ప్రశ్నలు వేశారు, దానికి అల్లు అర్జున్ ఎలాంటి సమాధానాలు చెప్పారనే విషయంలో అందరిలో విపరీతమైన క్యూరియాసిటీ కనిపిస్తుంది. 

అల్లు అర్జున్ కు చిక్కపల్లి పోలీసులు సంధించిన ప్రశ్నలివే. 

1. సంధ్య థియేటర్ దగ్గరకు ఎందుకు ఊరేగింపుగా వెళ్లాల్సి వచ్చింది?

2. సంధ్య థియేటర్ కు రావొద్దని మీకు ముందే యాజమాన్యం చెప్పిందా ?

3. పోలిసుల అనుమతి లేదు అని తెలుసా? తెలియదా? 

4. సంధ్య థియేటర్ లో ప్రీమియర్ కు హాజరవుతున్నామని అనుమతి కోరారా, కోరితే ఆ కాపి ఉందా ?

5. మీరు కానీ, మీ పిఆర్ టీమ్ కానీ పోలీస్ అనుమతి తీసుకుందా?

6. సంధ్య థియేటర్ దగ్గర పరిస్థితి మీ పిఆర్ టీమ్ మీకు ముందే వివరించిందా? 

7. సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది? 

8. తొక్కిసలాట విషయం మీకు ముందుగా ఎవరు చెప్పారు? 

9. ACP చెప్పినప్పుడు థియేటర్ నుంచి ఎందుకు వెళ్ళలేదు? 

10. రేవతి చనిపోయిన విషయం మరుసటి రోజు వరకు మీకు తెలియదా ?

11. సినిమా మొదలయ్యాక కొద్దిసేపటికే తొక్కిసలాట విషయం తెలిస్తే మీరెందుకు సినిమా చూసారు? 

12. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మీరు ముందే థియేటర్ యాజమాన్యానికి చెప్పారా 

13. రోడ్ షో కోసం ఎంతమంది బౌన్సర్లును ఏర్పాటు చేసుకున్నారు ?

14. బౌన్సర్లు ఎందుకంత దురుసుగా వ్యవహరించారు? అంటూ అల్లు అర్జున్ ని పోలీసులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.  

Source link