విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, ఈ నెల 28న పోలింగ్- మళ్లీ వైసీపీకే ఛాన్స్!-vizianagaram local bodies quota mlc election schedule released polling on nov 28th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

మళ్లీ వైసీపీకే ఛాన్స్

విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి నిలబెట్టుకోవాలని భావిస్తుంది. ఈ స్థానానికి తాజాగా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఎన్నికల కోడ్ ఇప్పటికే అమల్లోకి రావడంతో గజపతినగరంలో సీఎం చంద్రబాబు నాయుడు అధికారిక పర్యటన సైతం రద్దైంది. రెండున్నరేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మొత్తం 34 జడ్పీటీసీ స్థానాలు, 389 ఎంపీటీసీ స్థానాలకు గానూ 389 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు మాజీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుతో విభేదాలు ఉండడంతో ఆయన పేరు వైసీపీ పరిశీలించే అవకాశం ఉంది.

Source link