కూటమి ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి ఉంటే, అజిత్ సింగ్ నగర్ లో ఖాళీగా ఉన్న డిస్నీల్యాండ్, రైల్వే, డంపింగ్ యార్డ్ లలో ఉన్న 110 ఎకరాల స్థలాలను పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని డిమాండ్ చేశారు. ఖాళీ భూముల్ని గృహ నిర్మాణానికి వినియోగించాలని, కబేళా కోసం వినియోగించే తీర్మానాలను రద్దు చేయాలన్నారు.. ప్రభుత్వ భూములను పరిరక్షించాలి. పేదలు ప్రజాప్రయోజనాలకు వినియోగించాలి. దుర్వినియోగం కాకుండా నివారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.