విజయవాడ, విశాఖల్లో ఆటోలకు రైట్ రైట్, పర్మిట్లపై ఆంక్షల ఎత్తివేత.. మరింత పెరుగనున్న ట్రాఫిక్ చిక్కులు-lifting of restrictions on right of way and permits for autos in vijayawada and visakhapatnam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Auto Permits: ఏపీలోని విజయవాడ, విశాఖ నగరాల్లో ఆటోల రాకపోకలపై విధించిన నియంత్రణను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఇప్పటికే ఈ నగరాల్లో ఆటోల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. పర్మిట్‌ లేని ఆటోలు నగరంలో ప్రవేశించేందుకు అనుమతి ఉండదు. మిగిలిన పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆటోల రాకపోకలపై ఆంక్షలు లేవు. విజయవాడకు భౌగోళికంగా ఉన్న పరిమితులు, రోడ్ల విస్తీర్ణం, వాహనాల సంఖ్య, జనాభాను దృష్టిలో ఉంచుకుని ఆటోల సంఖ్యను పరిమితం చేశారు. అయితే ప్రస్తుతం అనుమతించిన ఆటోలకంటే రెట్టింపు సంఖ్యలో అవి ఉన్నాయి.

Source link