విద్యార్థినుల‌ పట్ల ఉపాధ్యాయుడి అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌.. దేహ‌శుద్ధి చేసిన గ్రామ‌స్తులు-teacher rude behavior towards female students in tirupati district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

లైంగిక వేధింపులు..

బాలిక‌ల‌పై లైంగిక వేధింపులు, అస‌భ్య ప్ర‌వ‌ర్త ఆరోప‌ణ‌లు రావ‌డంతో జిల్లా క‌లెక్ట‌ర్ త‌మీమ్ అన్సారియా ఆదేశాల మేర‌కు.. జిల్లా స్థాయి అధికారులు విచార‌ణ చేప‌ట్టారు. బాలిక‌ల‌పై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు, అస‌భ్య ప్ర‌వ‌ర్త రుజువు అయ్యాయి. డీఈవో కిర‌ణ్ కుమార్ ఆ ఉపాధ్యాయుడు ర‌వి కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చారు. ఆధారాల‌ను మ‌ద్దిపాడు పోలీస్ స్టేష‌న్‌లో స‌మ‌ర్పించారు. ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు న‌మోదు చేశారు. ఎస్ఐ బి.శివ‌రామ‌య్య స్పందిస్తూ.. పోక్సో కేసు న‌మోదు చేశామ‌ని, ద‌ర్యాప్తు కొన‌సాగుతోంద‌ని చెప్పారు.

Source link