విద్యార్థులకు అలర్ట్… ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పొడిగింపు-telangana board of intermediate extends inter 1sy year admissions deadline 2023 ,తెలంగాణ న్యూస్

ఇంటర్ ఇంగ్లీష్‌కూ ప్రాక్టికల్స్‌….!

ఈ కొత్త విద్యాసంవత్సరంలో పలు సంస్కరణలు అమలు చేసే దిశగా తెలంగాణ ఇంటర్ బోర్డు అడుగులు వేసింది. ఓవైపు సిలబస్ మార్పులపై దృష్టి పెట్టగా… ఇంగ్లీష్ పరీక్షా విధానంలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఇంగ్లీష్ లో ప్రాక్టికల్స్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ కొత్త విద్యాసంవత్సరం (2023-24) నుంచి ఇంటర్ ఫస్టియర్‌ విద్యార్థులకు వీటిని అమలు చేయనున్నారు. ప్రాక్టికల్స్‌కు 20 మార్కులు కేటాయిస్తే…. రాత పరీక్ష 80 మార్కులకే ఉండనుంది. ఇప్పటివరకు ఇంటర్ సెకండియర్‌లోని భౌతిక, రసాయన శాస్త్ర సబ్జెక్టులతో పాటు జువాలజీ,బొటనీ సబ్జెక్టులకు ప్రాక్టికల్స్ ఉన్నాయి. అయితే వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్‌లోనూ ప్రాక్టికల్స్‌ అమలు చేయనున్నారు. ఫలితంగా థియరీ మార్కులు తగ్గిపోతాయి. ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్‌ బోర్డు సమావేశంలో ఇంగ్లిష్‌లో ప్రాక్టికల్స్‌ అమలుపై నిర్ణయం తీసుకొన్నారు. వార్షిక పరీక్షలే కాకుండా ఇంటర్నల్‌ ఎగ్జామ్స్‌ను కూడా ఇదే విధానంలోనే నిర్వహించే అవకాశం ఉంది.

Source link