విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఈనెల 6వ తేదీ నుంచి ఒక్కపూటే బడి.. కారణం ఇదే-half day schools in telangana from november 6th ,తెలంగాణ న్యూస్

కుల గణన ప్రక్రియపై బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 6వ తేదీ కుల గణన సర్వే జరుగుతుందని చెప్పారు. 85,000 మంది ఎన్యూమరేటర్లు ఉంటారని వివరించారు. ప్రతి 10 మంది ఏనుమరేటర్లకు ఒక పరిశీలకుడు ఉంటారని వెల్లడించారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్టాయి అధికారుల పర్యవేక్షణలో ప్రతి ఇంటి నుంచి సమగ్ర సమాచాారాన్ని సేకరిస్తారని తెలిపారు. నవంబర్ 30వ తేదీలోపు సమాచార సేకరణ పూర్తి చేసే దిశగా ప్రణాళికలు ముందుకు సాగుతున్నాయని వివరించారు. ఈ సర్వేను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ సర్వేలో భాగం కావాలని పిలుపునిచ్చారు.

Source link