విశ్వంభరలో మెగాస్టార్ గ్యాంగ్ లీడర్ లుక్

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న విశ్వంభర అనే సోషియో ఫాంటసీ చిత్రంలో ఆయన లుక్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 60 ప్లెస్ వయస్సులోనూ చిరు యంగ్ లుక్‌తో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమా కోసం ఆయన జిమ్‌లో కఠినమైన వర్కౌట్స్ చేసి తన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై శ్రద్ధ పెట్టారు. ఫ్యాన్స్ అయితే గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు రోజులు మళ్లీ వచ్చాయని భావిస్తున్నారు. సినిమా నుంచి విడుదలైన ప్రతి స్టిల్‌కి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు.

విశ్వంభర పూర్తయ్యాక చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమా జూన్ మొదటి వారంలో ప్రారంభమై 2026 సంక్రాంతికి విడుదల కానుందని టాక్. ఇది పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఇందులో అదితి రావు హైదరి, తమన్నా కథానాయికలుగా కనిపించే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంగీతం అందించేందుకు భీమ్స్, రమణ గోగుల ఎంపికయ్యారని సమాచారం.

చిరంజీవి గతంలో పల్లెటూరి మొనగాడు, ఖైదీ, ఇంద్ర వంటి గ్రామీణ నేపథ్య సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మళ్లీ అనిల్ రావిపూడితో అలాంటి కథను ఎంచుకోవడం ఆసక్తిని పెంచుతోంది. మెగాస్టార్ వరుస హిట్ సినిమాలతో ఫ్యాన్స్‌కి మాంచి వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు చిరంజీవి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.

Source link