విద్యుత్ సిబ్బంది చూడటంతో….
ఇక వీరి మృతి విషయం విద్యుత్ సిబ్బంది చూడటంతో బయటికి వచ్చింది. గురువారం కరెంట్ బిల్లు వసూలు చేసేందుకు విద్యుత్ సిబ్బంది వెళ్లటంతో గోడ కూలిపోయి ఉండటాన్ని గమనించారు. స్థానికులతో పాటు ఎమ్మార్వో కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. వారంతా అక్కడికి చేరుకోని గోడలను జరిపి చూడగా… వీరి ముగ్గురి మృతదేహాలు బయటపడ్డాయి. పోస్టుమార్టం కోసం తుంగతుర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన తల్లి,తండ్రి, కుమారుడు చనిపోవటంతో… వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.