వీఆర్ఏలు ఇకపై పే స్కేల్ ఉద్యోగులు
మరో కేటగిరీలో 3,797 మంది 61 సంవత్సరాలు దాటిన వారికి, వారు ఇంత కాలం చేసిన సేవకు గాను, మానవీయ కోణంలో ఆలోచించి, వారు కొనసాగుతున్న క్వాలిఫికేషన్ తోనే వారి పిల్లలకు ఉద్యోగాలిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వీఆర్ఏల జేఏసీ ఎంత తొందరగా లిస్ట్ ఇస్తే అంత తొందరగా వారికి ఆర్డర్ లిస్తామన్నారు. ఈ ఆర్డర్ లోనే ఆ విషయాలను పొందుపరిచినట్లు సీఎం తెలిపారు. వీఆర్ఏలు వారి పిల్లలను తీసుకొని వస్తే వారి విద్యార్హతలను బట్టి ప్రభుత్వం తదుపరి చర్యలు చేపడుతుందన్నారు. వీఆర్ఏలు ఇక నుంచి పే స్కేల్ ఉద్యోగులు అని సీఎం స్పష్టం చేశారు. మీరందరూ ఆయా డిపార్ట్మెంట్లలో మంచి పేరు తెచ్చుకోవాలని, ఇంకా చదివి ప్రమోషన్లు కూడా తెచ్చుకోవాలని కోరుతున్నానని సీఎం సూచించారు. మంత్రి కేటీఆర్ ఈ ప్రక్రియ తొందరగా పూర్తయ్యేలా, మీ దగ్గరకు చేరేలా చొరవ తీసుకున్నందున కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఉత్తర్వులిస్తే ఇస్తే బాగుంటందని సూచించి, సీఎస్ శాంతి కుమారి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఈ రోజే ఉత్తర్వులు వచ్చే విధంగా కృషి చేశారని సీఎం తెలిపారు. ఈ ప్రక్రియలో ఎలాంటి లీగల్ సమస్యలు తలెత్తకుండా జీవోను రూపొందించినందుకు వారికి సీఎం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.