CM KCR : వీఆర్ఏల సర్దుబాటుపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సచివాలయంలో వీఆర్ఏ క్రమబద్దీకరణ, సర్దుబాటుపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. వీఆర్ఏల విద్యార్హతలను బట్టి నాలుగు శాఖల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. నీటిపారుదల, పురపాలక, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ శాఖల్లో వీఆర్ఏలను సర్దుబాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 61 ఏండ్లు దాటిన వీఆర్ఏలు తమ ఉద్యోగాన్ని వారసులకు ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. వీఆర్ఏల సర్దుబాటు, క్రమబద్దీకరణకు సంబంధించిన జీవోను సోమవారం విడుదల చేసే అవకాశం ఉంది.