వీఓఏలకు కేసీఆర్ సర్కార్ తీపి కబురు.. గౌర‌వ వేతనం పెంపు, ఉత్తర్వులు జారీ-cm kcr good news to village organization assistants ,తెలంగాణ న్యూస్

వీఓఏల జీతాల పెంపు వివరాలు:

ఉమ్మడి రాష్ట్ర కాలంలో గ్రామాల్లో పొదుపు సంఘాలుగా ఏర్పడిన మహిళలకు సహాయకులుగా పనిచేస్తూ, సంఘానికి సంబంధించిన ఆర్థికపరమైన అంశాలు, తదితర సమాచారాన్ని నోట్ బుక్కుల్లో నమోదు చేసే విధులను స్వచ్ఛందంగా నిర్వహించేవారు. వారు సేవ చేస్తున్న మహిళా సంఘాలనుంచి మాత్రమే ‘‘గ్రూపు లీడర్లు’’ గా కేవలం నెలకు రెండు వేలు రూపాయలు గౌరవ వేతనం ఇచ్చేవారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2016 సంవత్సరం నుంచి వీరికి నెలకు మూడు వేల రూపాయలను గౌరవ వేతనంగా అందించడం జరిగుతూ వస్తున్నది. అంతే కాకుండా అందరికీ ఇటీవలే పెంచిన పీఆర్సి ని వీరికి కూడా అమలు చేస్తూ మరోమారు తన మానవీయ కోణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. దాంతో వీరికి ప్రభుత్వం అందించే వేతనం రూ.3,900 కు చేరింది. మహిళా సంఘాలనుంచి అందే రెండు వేలుతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే రూ.3,900 మొత్తం కలిపితే వీరి వేతనం కేవలం రూ.5,900 మాత్రమే. ఈ పరిస్థితుల్లో వీరు క్షేత్రస్థాయిలో పడుతున్న కష్టాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ మరోసారి ఆదకుని ఆసరానందించేందుకు నిర్ణయించారు. వారి విజ్ఞప్తి మేరకు రాఖీ పండుగ కానుకగా వీరి జీతాలను పెంచాలని నిర్ణయించారు.

Source link