ముద్రగడ లేఖ వెనుక ఆయన రాజకీయ స్వార్ధం ఉందని, 2019 వరకు అనేక ఉద్యమాలు చేసి, తరువాత ఎందుకు సైలెంట్ అయ్యారని ప్రశ్నించారు. తుని ఘటనలొ నువ్వు అమాయక కాపు యువత జీవితాలను నాశనం చేశారని, కాపుల ముసుగులో జగన్ కు, ద్వారం పూడికి అనుకూలంగా పని చేస్తున్నారన్నారు. ముద్రగడకు దమ్ముంటే వైసిపిలో చేరి పనిచేసుకోవాలని, కాపు నేత ముసుగులో డ్రామాలు ఆడితే యువత తరిమి కొడతారన్నారు.