Sake Sailajanath: మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ వైసీపీలో చేరారు. కొంతకాలంగా రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న శైలజానాథ్ 2023లో టీడీపీలో చేరేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. శైలజానాథ్ టీడీపీలో చేరే సమయంలోనే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేయడంతో ఆ ప్రయత్నాలు విరమించుకున్నారు. అప్పట్లో రాజమండ్రి వెళ్లి చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని కూడా పరామర్శించారు.