ఎన్నికల్లో ఓటమి తర్వాత రాయపాటి తెలుగు దేశం పార్టీకి దూరం అయ్యారు. తాజాగా కన్నాను చేర్చుకోవడంపై అసంతృప్తి రెట్టింపైంది. పార్టీలోకి కొత్త నేతలు రాగానే సీనియర్లను పట్టించుకోలేదని అక్కసు పెరిగింది. కన్నాతో సుదీర్ఘ కాలంగా ఉన్న విబేదాలు, కోర్టువివాదాలను కొద్ది నెలల క్రితమే రాజీ ద్వారా పరిష్కరించుకున్నారు. పరువు నష్టం దావాలతో ఒరిగిదేమి ఉండదని గుర్తించడం, వయో భారం కూడా రాజీకి ఇరుపక్షాలు మొగ్గు చూపాయి. కోర్టు వివాదాలు పరిష్కారమైనా ఆధిపత్యం కోసం ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. అదే సమయంలో బీజేపీ నుంచి కన్నా టీడీపీలో చేరడం, సత్తెనపల్లి బాధ్యతలు అప్పగించడం రాయపాటిని నిలువనీయకుండా చేసింది.