వైసీపీ హయాంలో మద్యం పాలసీపై సీఐడీ విచారణ, సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం-amaravati cm chandrababu stayed order cid investigation on ysrcp govt liquor police ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

CM Chandrababu : మద్య నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్… మద్యంతో వ్యాపారం చేసి కోట్లు వెనకేసుకున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. అసెంబ్లీ మద్యంపై శ్వేత పత్రం విడుదల చేశారు. గత ప్రభుత్వ మద్యం విధానంపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2019-24లో వైసీపీ మద్యం పాలసీపై సీఐడీతో విచారణ చేయిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఎక్సైజ్ శాఖలో అవినీతి జరిగిందని, వాటిపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజ్ఞప్తి మేరకు సీఎం చంద్రబాబు.. ఈ నిర్ణయం ప్రకటించారు. అంతా నగదు లావాదేవీలు చేశారని, సీఐడీ విచారణలో వాస్తవాలు బయటపడతాయన్నారు. నగదు లావాదేవీలపై ఈడీకి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Source link