శామీర్ పేట కాల్పుల ఘటనలో ట్విస్ట్, ఆ మనోజ్ తాను కాదని సీరియల్ నటుడు వీడియో రిలీజ్-shamirpet gun fire incident serial actor manoj released video clarified

అసలేం జరిగింది?

శామీర్ పేట్ సెలబ్రిటీ క్లబ్ లో ఓ యువకుడిపై మనోజ్ కుమార్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. దీంతో అప్రమత్తమైన యువకుడు అక్కడి నుంచి తప్పించుకుని శామీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు. హైదరాబాద్ కు చెందిన సిద్ధార్థదాస్‌, తన భార్య స్మిత గ్రంథి 2019లో విడిపోయాడు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే భర్తతో విడిపోయిన స్మిత శామీర్‌పేట్‌ సెలబ్రిటీ క్లబ్ లో ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, మనోజ్‌కుమార్‌తో సహజీవనం చేస్తోంది. సిద్ధార్థదాస్ తన పిల్లలను చూసేందుకు విల్లాకు వచ్చాడు. ఈ క్రమంలో స్మితతో సిద్ధార్థ గొడవపడ్డాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న మనోజ్‌ కుమార్‌… ఎయిర్‌గన్‌తో సిద్ధార్థపై కాల్పులు జరిపాడు. అక్కడి నుంచి తప్పించుకున్న సిద్ధార్థ… జరిగిన విషయంపై శామీర్‌పేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనలో సిద్ధార్థకు గాయాలు కాలేదు కానీ, మనోజ్ హత్యాయత్నానికి పాల్పడ్డాడనే ఫిర్యాదు నమోదు అయింది. అయితే ఈ మనోజ్… సీరియల్ నటుడని ప్రచారం జరిగింది. కానీ ఆ మనోజ్ తాను కాదని సీరియల్ నటుడు మనోజ్ ఓ వీడియో విడుదల చేశారు.

Source link