శైవ క్షేత్రాలకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు-అద్దెకు తీసుకునే ఆర్టీసీ బస్సు ఛార్జీల తగ్గింపు-tgsrtc running special buses to shiva temples due to karthika masam arunachalam package ,తెలంగాణ న్యూస్

కార్తీక మాసంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాల‌కు భ‌క్తుల సౌక‌ర్యార్థం ప్రత్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జనార్ తెలిపారు. శ్రీశైలం, వేముల‌వాడ, ధ‌ర్మపురి, కీస‌ర‌గుట్ట, ఇతర దేవాల‌యాల‌కు హైద‌రాబాద్ నుంచి స్పెష‌ల్ బ‌స్సుల‌ను న‌డుపుతున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఆర్టీసీ ప‌నితీరు, కార్తీక‌మాసం ఛాలెంజ్, శ‌బ‌రిమ‌ల ఆపరేష‌న్స్‌, మహాల‌క్ష్మి-మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు సౌక‌ర్య ప‌థ‌కం, త‌దిత‌ర అంశాల‌పై హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్ నుంచి శ‌నివారం వ‌ర్చ్‌వ‌ల్‌గా ఉన్నత‌స్థాయి స‌మీక్షా స‌మావేశాన్ని సంస్థ ఎండీ వీసీ స‌జ్జనార్ నిర్వహించారు.

Source link