శ్రీవాణి ట్రస్టు ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అనేక పురాతన ఆలయాల జీర్ణోద్ధరణతోపాటు ఎస్‌సి, ఎస్‌టి, బిసీ, మత్స్యకార గ్రామాల్లో ఆలయాల నిర్మాణానికి టీటీడీ నిధులు అందిస్తోంది. దీంతోపాటు ఆయా ప్రాంతాల్లోని ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు ఆర్థికసాయం కూడా చేస్తోంది. టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి శ్రీవాణి ట్రస్టుపై ఇటీవల శ్వేతపత్రం విడుదల చేశారు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు శ్రీవాణి ట్రస్టు నిర్వహణపై ఆరోపణలు చేస్తుండడంతో ఈ విషయంలో వాస్తవాలు వెలుగులోకి తీసుకురావడానికి తిరుపతి ప్రెస్‌క్లబ్ నిజనిర్ధారణ కమిటీగా ఏర్పాటై ముందుకు వచ్చింది. వాస్తవాలు తెలుసుకోవడానికి సదరు కమిటీకి టీటీడీ అనుమతిస్తున్నట్లు పేర్కొంది.