జూన్ నెలలో రూ.116.14 కోట్ల ఆదాయం
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనాలకు పారదర్శకంగానే టోకెన్ల కేటాయిస్తున్నామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. పార్వేట మండపం పునర్ నిర్మాణంపై వివాదం సరికాదన్నారు. కుంగిపోయే స్థితిలో ఉండడంతో మండపాన్ని పునరుద్ధరణ చేస్తున్నామన్నారు. వేసవితో సంబంధం లేకుండా తిరుమలకు భక్తులు వస్తున్నారన్నారు. వేసవిలో భక్తుల తాకిడి నేపథ్యంలో ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటా తగ్గించామని, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో మళ్లీ 15 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లు ఆన్లైన్ లో విడుదల చేస్తామని ఈవో ప్రకటించారు. జూన్ నెలలో శ్రీవారిని 23 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని ఈవో ప్రకటించారు. హుండీ ద్వారా రూ.116.14 కోట్ల ఆదాయం లభించిందని వెల్లడించారు. జూన్ నెలలో కోటి ఆరు లక్షల లడ్డూలు విక్రయించామని, 10.80 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.