దేశవ్యాప్తంగా కాలేజీలు…
ప్రస్తుతం బీఎస్ రావు వయసు 75 సంవత్సరాలు. అనారోగ్యంతో హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. బీఎస్ రావు భౌతికకాయాన్ని స్వస్థలం అయిన విజయవాడకు తరలిస్తున్నారు. జూలై 14న విజయవాడలో బీఎస్ రావు అంత్యక్రియలు జరగనున్నాయి. బీఎస్ రావు తొలినాళ్లలో యూకే, ఇరాన్ లో డాక్టర్ గా పని చేశారు. అనంతరం భార్యతో కలిసి 1986లో శ్రీ చైతన్య విద్యాసంస్థలను స్థాపించారు. అందులో భాగంగా తొలుత విజయవాడలోనే తొలి జూనియర్ కాలేజీని పెట్టారు. విజయవాడ నుంచి నెమ్మదిగా తమ కాలేజీలను పెంచుకుంటూపోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వీరి కాలేజీలు ఉన్నాయి. మొత్తం 321 జూనియర్ కాలేజీలు, 322 శ్రీ చైతన్య టెక్నో స్కూళ్లు, 107 సీబీఎస్ఈ స్కూళ్లను వీరి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.