2010 ఏప్రిల్ 12న హైదరాబాద్‍లో సానియా మీర్జా, షోయబ్ మాలిక్ వివాహం ముస్లిం సంప్రదాయ పద్ధతిలో జరిగింది. అనంతరం వలీమా పాకిస్థాన్‍లోని సియాల్కోట్‍లో జరిగింది. 2018లో మగపిల్లాడు ఇజాన్‍కు జన్మనిచ్చింది సానియా. వీరిద్దరూ మంచి జంటగా పేరు తెచ్చుకున్నారు. అయితే, గతేడాది నవంబర్‌లో వీరి విడాకుల ఊహాగానాలు తొలిసారి బయటికి వచ్చాయి. సానియా, షోయబ్ వేర్వేరుగా ఉంటున్నారని, కుమారుడిని ఇద్దరూ చూసుకునేలా న్యాయపరమైన అంశాలను సెటిల్ చేసుకుంటున్నారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. సానియా, షోయబ్ చేసిన కొన్ని సోషల్ మీడియా పోస్టులు కూడా ఈ పుకార్లకు ఆజ్యం పోశాయి. అయితే, మీర్జా అండ్ మాలిక్ షోను కలిసి చేసి ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఆ ఇద్దరూ ప్రయత్నించారు. అయితే, విడాకుల వార్తలను మాత్రం నేరుగా ఖండించలేదు.