సంక్రాంతికి వస్తున్నాం అభిమానులకు సర్ ప్రైజ్

సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ గా టీవీ ప్రీమియర్స్ గా మార్చ్ 1 న జీ తెలుగు నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవగా.. సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ డేట్ కూడా మార్చ్ 1 నుంచే జీ 5 లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. జీ 5 ఖచ్చితంగా డేట్ లాక్ చెయ్యకపోయినా మార్చి 1 ఫిక్స్ అంటున్నారు. 

ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ ఆడియన్స్ కు మేకర్స్ బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారట. సంక్రాంతికి వస్తున్నాం థియేటర్‌ వెర్షన్ లో నిడివి కారణంగా కొన్ని కామెడీ సన్నివేశాలని దర్శకుడు అనిల్‌ రావిపూడి ఎడిటింగ్ లో కట్ చేశారట. తాజాగా ఓటీటీ వెర్షన్‌లో ఆ ఎడిటెడ్ సీన్లు యాడ్‌ చేస్తే బావుంటుందని మూవీ టీమ్ భావిస్తుందట. 

సంక్రాంతికి థియేటర్స్ లో విడుదలై ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ఆడియన్స్ ను ఆకట్టుకుంది కాబట్టి ఓటీటీలో ఇంటిల్లిపాది కూర్చొని చూస్తారు, అందుకే ఎడిట్ సీన్స్ ను కలిపితే బావుంటుంది అనే ఆలోచనలో ఉన్నారట. 

Source link