సంక్రాంతికి వస్తున్నాం టీవీ ఓటీటీ సర్ ప్రైజ్


Sun 23rd Feb 2025 09:56 AM

sankranthiki vasthunam  సంక్రాంతికి వస్తున్నాం టీవీ ఓటీటీ సర్ ప్రైజ్


TV and OTT Surprise Sankranthiki Vastunnam సంక్రాంతికి వస్తున్నాం టీవీ ఓటీటీ సర్ ప్రైజ్

వెంకటేష్-అనిల్ రావిపూడి ల లేటెస్ట్ సెన్సేషన్ సంక్రాంతికి వస్తున్నాం 300 కోట్ల క్లబ్బు లో అలవోకగా అడుగుపెట్టింది. ప్రస్తుతం థియేట్రికల్ రన్ ముగియడంతో సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ అలాగే టీవీ ప్రీమియర్స్ కి రెడీ అయ్యింది. కొన్నాళ్లుగా ఓటీటీల హవా నడుసున్న నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం శాటిలైట్ పరంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. 

సంక్రాంతికి వస్తున్నాం డిజిటల్ హక్కులను జీ 5 ఓటీటీ ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకోవడమే కాదు ఈ చిత్ర శాటిలైట్ హక్కులను జీ తెలుగు కొనేసింది. ఈ చిత్రాన్నిముందుగా టీవీ ప్రీమియర్స్ అంటూ మార్చ్ 1 సాయంత్రం 6 గంటలకు డేట్ టైమ్ ఫిక్స్ చేసారు మేకర్స్. దానితో సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ పై సస్పెన్స్ మొదలయ్యింది. 

తాజాగా సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ డేట్ కూడా వచ్చేసింది. టీవిలో టెలికాస్ట్ సమయం సాయంత్రం 6 గంటల నుంచే జీ5 ఓటీటీ లో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ తెస్తున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేసారు. మరి టీవీ లో ఓటిటిలో ఒకే సమయంలో రాబోతున్న ఈ చిత్రం ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి.


TV and OTT Surprise Sankranthiki Vastunnam:

Sankranthiki Vasthunam OTT Release Date Confirme





Source link