సర్పంచ్ అంటే ఇలా ఉండాలి.. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మన ఆడబిడ్డ-national award for godavarru sarpanch janaki devi of guntur district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఆదర్శ గ్రామంగా చేస్తా..

జానకీదేవి పాలనపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామం అంతా రోడ్లు, వీధి లైట్లు, తాగునీరు ఏర్పాటు చేయించారని చెబుతున్నారు. గ్రామానికి బస్సు సౌకర్యం లేదని.. దీని కోసం ప్రయత్నించాలని కోరుతున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు రావడంపై జానకీదేవి ఆనందం వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులు, గ్రామస్థుల సహకారంతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందానని చెబుతున్నారు. తమ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని.. దాన్ని కూడా నిర్మించి గొడవర్రును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని జానకీ దేవి చెబుతున్నారు.

Source link