సలార్1 రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ అసంతృప్తి


Sun 22nd Dec 2024 01:18 PM

prashanth neel  సలార్1 రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ అసంతృప్తి


Prashanth Neel unhappy with the success of Salaar సలార్1 రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ అసంతృప్తి

సలార్ పార్ట్ 1 విడుదలై నేటికి ఏడాది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పృథ్వీ రాజ్ సుకుమారన్ లు కలిసి నటించిన సలార్1 చిత్రాన్ని కన్నడ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. గత ఏడాది డిసెంబర్ 22 న విడుదలైన సలార్ చిత్రం మాస్ హిట్ గా నిలిచింది. సలార్ 1 విడుదలై నేటికి ఏడాది అంటూ మేకర్స్ పోస్టర్ కూడా వదిలారు. 

అయితే సలార్ పార్ట్ 1 రిజల్ట్ పై తాను హ్యాపీగా లేను అంటూ ప్రశాంత్ నీల్ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. సలార్ పార్ట్ 1 సక్సెస్ అయినా.. దానిలో ఎక్కడో కెజిఎఫ్ 2 ఛాయలు కనిపించాయి. సలార్ పార్ట్ 1 కోసం చాలా కష్టపడ్డాను. సలార్ 2ని మాత్రం నా కెరీర్ లో బెస్ట్ చిత్రంగా నిలిచిపోయేలా చేస్తాను. ఆడియన్స్, ఫ్యాన్స్ ఊహలకు అందని విధంగా సలార్ 2 ఉంటుంది. 

నా లైఫ్ లో కొన్ని విషయాలపై చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాను, అందులో సలార్ 2 కూడా అంటుంది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కు ప్రశాంత్ నీల్ సలార్ 2 పై అంచనాలు పెంచుతూనే మాటిచ్చేసారు. 


Prashanth Neel unhappy with the success of Salaar:

Prashanth Neel interview respond Salaar result and part 2





Source link