Singareni Jobs : సింగరేణి సంస్థ(Singareni Jobs)లో 327 ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని అధికారులు పేర్కొ్న్నారు. అయితే తాజాగా ఈ తేదీల్లో మార్పులు చేశారు. కొన్ని కారణాల వల్ల దరఖాస్తుల (singareni applications)ప్రక్రియను సవరించామని తెలిపారు. కొత్త షెడ్యూల్(Sinagreni Jobs new Schedule) ప్రకారం అభ్యర్థులు మే 15 మధ్యాహ్నం 12 నుంచి జూన్ 4 సాయంత్రం 5 గంటల వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
మే 15-జూన్ 4 మధ్య దరఖాస్తులు
సింగరేణి సంస్థ 327 మేనేజ్ మెంట్ ట్రైనీ(Singareni management trainee), జూనియర్ ఇంజినీర్ ట్రైనీ, అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైమీ, ఫిట్టర్ ట్రైనీ, ఎలక్ట్రిషియన్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి మార్చి నెలలో నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 15 నుంచి మే 4వ నిర్వహించాల్సి ఉంది. కానీ ఈ ప్రక్రియను వాయిదా వేశారు. మే 15 నుంచి జూన్ 4 వరకు దరఖాస్తులు(Singareni applications) స్వీకరించనున్నారు. అభ్యర్థులు https://scclmines.com/ వెబ్ సైట్ లో దరఖాస్తులను సమర్పించవచ్చు.
ఖాళీల వివరాలు(Singareni Jobs) :
- మేనేజ్ మెంట్ ట్రైనీ(E2 గ్రేడ్) – 42
- మేనేజ్ మెంట్ ట్రైనీ సిస్టమ్స్ – 07
- జూనియర్ ఇంజినీర్ ట్రైనీ(గ్రేడ్ సీ) -100
- జూనియర్ ఇంజినీర్ ట్రైనీ(మెకానికల్)- 09
- అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ -24
- ఫిట్టర్ ట్రైనీ – 47
- ఎలక్ట్రిషియన్ ట్రైనీ – 98
వయో పరిమితి వివరాలు(Age Limit)
మేనేజ్ మెంట్ ట్రైనీ(Management Trainee) పోస్టులు ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఉండగా, మిగతా పోస్టులు నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ లో ఉన్నాయి. వైద్యాధికారి పోస్టు మినహా మిగిలిన పోస్టులకు గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లుగా సింగరేణి సంస్థ నిర్ణయించింది. ( ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల వరకు గరిష్ట వయోపరిమితి మినహాయింపు ఇస్తారు)
తెలంగాణ సివిల్ జడ్జి ఉద్యోగాలు
సివిల్ జడ్జి ఉద్యోగాల భర్తీకి తెలంగాణ హైకోర్టు(Telangana High Court) నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను హైకోర్టు విడుదల చేసింది. ఈ పోస్టులకు ఏప్రిల్ 18వ తేదీ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మే 17వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. https://tshc.gov.in/getRecruitDetails వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.
ముఖ్యమైన వివరాలు
- మొత్తం ఖాళీలు – 150 (ఇందులో కొన్ని డైరెక్ట్ రిక్రూట్ మెంట్, మరికొన్ని ట్రాన్స్ ఫర్ రిక్రూట్ మెంట్)
- అర్హతలు – గుర్తింపు పొందిన వర్శిటీ నుంచి లా డిగ్రీ పొంది ఉండాలి. తెలంగాణ జ్యుడీషియల్ రూల్స్ 2023 ప్రకారం నిర్ధేశించిన అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.
- దరఖాస్తులు ప్రారంభం – ఏప్రిల్ 18, 2024.
- దరఖాస్తులకు చివరి తేదీ – మే 17, 2024.
- ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది.
- ఎస్సీ, ఎస్టీ, ఈడబ్య్లూఎస్ అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి.
- హాల్ టికెట్లు – 08 జూన్ 2024.
- స్క్రీనింగ్ టెస్ట్(కంప్యూటర్ ఆధారిత పరీక్ష) – 16 జూన్ 2024.
- 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.