సినీ ప్రముఖులకు రేవంత్ తేల్చి చెప్పిందేంటి

సినిమా వాళ్ళకే సినిమా చూపించిన సీఎం రేవంత్!

టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం ముగిసింది. రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు విషయాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. తాజా పరిణామాలు, ప్రభుత్వానికి ఇండస్ట్రీ ఏం చేయాలి? ఇండస్ట్రీ కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇలా అన్ని విషయాలపై కీలకంగా చర్చించారు. ఈ సందర్భంగా సంధ్య థియేటర్ ఘటన తాలూకు 9 నిమిషాల వీడియోను రేవంత్ ప్రదర్శించారు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా వాళ్లకు సినిమా చూపించారు రేవంత్ రెడ్డి అని బయట మాట్లాడుకుంటున్న పరిస్థితి.

నో డౌట్స్.. నేనున్నా..!

భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారనే విషయానికి వస్తే కొన్ని విషయాల్లో కఠినంగా ఉంటానని తేల్చి చెప్పేశారు. సినిమా పరిశ్రమ సమస్యలను మా ద్రుష్టికి తెచ్ఛారు. అనుమానాలు, అపోహలు, ఆలోచనలను పంచుకున్నారు. 8 సినిమాలకు మా ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చాం. పుష్ప2 సినిమా ప్రీ రిలీజ్ కోసం పోలీస్ గ్రౌండ్ ఇచ్చాం. తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పరిశ్రమ బాగుండాలని కోరుకున్నాం. ఐటీ, ఫార్మాతో పాటు మాకు సినిమా పరిశ్రమ మాకు ముఖ్యం. తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి సమావేశంలో స్పష్టం చేశారు.

వారధి దిల్ రాజు..

ప్రభుత్వం, సినిమా పరిశ్రమ కు మధ్యవర్తిగా, వారధిగా ఉండానికి దిల్ రాజును ఎఫ్ డిసి ఛైర్మన్ గా నియమించాం. సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తాం. పరిశ్రమ కూడా కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. తెలంగాణలో ఎక్కడైనా ఘాటింగ్ చేసుకుని హైదరాబాద్ మహా నగరానికి కేవలం కు రెండు గంటలల్లో రావొచ్చు. తెలంగాణలోని ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయండి. ముంబైలో వాతావరణం కారణంగా బాలీవుడ్ అక్కడ స్థిరపడింది. కాస్మోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ బెస్ట్ సిటీ. హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు తీసుకోండి అని సినీ పెద్దలకు రేవంత్ రెడ్డి కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు.

నెక్ట్ప్ లెవల్ అంతే.. ఇలా చేయండి..

హైదరాబాద్ నగరంలో పెద్ద సదస్సు ఏర్పాటు చేసి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. సినీ పరిశ్రమను నెక్ట్ప్ లెవల్ కు తీసుకెళ్లడమే మా ఉద్దేశం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నాం. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి నైపుణ్యాలను పెంచి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. రూ. 140 కోట్ల జనాభా ఉన్న దేశం ఒలింపిక్స్ ఆటల్లో పతకాలు తెచ్చుకోలేకపోతుంది. స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. గంజాయి, డ్రగ్స్ మత్తు పదార్ధాలతో పాటు సామాజిక అంశాలపైన సినీ పరిశ్రమ ప్రచారం చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు.

నాడు.. నేడు మేమే..!

సినిమా పరిశ్రమకు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయి.ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాం. సినిమా పరిశ్రమను ప్రోత్సాహించడమే మా ముఖ్య ఉద్దేశం. ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన భాద్యత నాది. నాకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు నాకు లేవు. తెలుగు పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అంతా కలిసి అభివృద్ధి చేద్దాం. మా ప్రభుత్వం పరిశ్రమ కు ఎల్లప్పుడు అండగా ఉంటుంది. కొందరు హీరోల్లాగే రాజకీయాల్లో నా వైఖరి విభిన్నం. నాకు ప్రత్యేకంగా ఎలాంటి రాగద్వేషాలు లేవు. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా హీరోగా ఉండాలి. సినీ పరిశ్రమకు సామాజిక బాధ్యత ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేశారు.

Source link