సీఎం జగన్ పాలనలో ఏపీ నేరాంధ్రప్రదేశ్ గా మారింది- చంద్రబాబు-tdp chief chandrababu open letter to ap people crime increased in ysrcp govt

Chandrababu : ఏపీలో జరుగుతున్న నేరాలపై టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. వైసీపీ పాలనలో ఏపీ నేరాంధ్రప్రదేశ్ గా మారిందని ఆరోపించారు. బాపట్ల జిల్లాలో పదో తరగతి విద్యార్థి సజీవదహనం సహా పలు ఘటనలను చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. సీఎం జగన్ పనితీరు, ప్రభుత్వ అసమర్థతతో నేరాలు పెరుగుతున్నాయని, నేరగాళ్లకు ఊతం ఇచ్చేలా ఉన్నాయని ఆక్షేపించారు. మూడు రోజుల్లో జరిగిన నాలుగు అంశాలను చంంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలు ఆలోచించాలని కోరారు. మహిళలకు భద్రతలేదని, ఆస్తులకు రక్షణ లేదని, చట్టసభల్లో గౌరవం లేదని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గంజాయి, గన్‌ కల్చర్‌ పెరుగుతున్నాయన్నారు. కష్టపడి సంపాదించిన ఆస్తిని వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి విశాఖలో ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ వ్యవహారం నిదర్శనం అని చంద్రబాబు అన్నారు.

Source link