ఖమ్మం జిల్లా పొన్నెకల్‌లో మంత్రి పొంగులేటి పర్యటించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన చేశారు. ‘కులమతాలకు అతీతంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శ్రీకారం చుట్టాం. గత ప్రభుత్వం విద్యాశాఖను పట్టించుకోలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం అమ్మ ఆదర్శ పథకం పేరుతో రూ.657 కోట్లు కేటాయించాం. డీఎస్సీ ద్వారా 10,600 పోస్టుల భర్తీ చేశాం’ అని పొంగులేటి వివరించారు.