29 శాతం పెరిగిన రియల్ ఎస్టేట్
1 ఏప్రిల్ – 30 నవంబర్ 2023 ఆరు నెల్లతో పోల్చితే 1 ఏప్రిల్ – 30 నవంబర్ 2024 కాలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 29 శాతం పెరిగిందన్నారు. రాజధాని హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించాలంటే మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణం, గోదావరి నుంచి నీటిని తరలింపు, మూసీ ప్రక్షాళన చేయక తప్పదన్నారు. ఈ ప్రాజెక్టులన్నింటికీ రాబోయే 4 సంవత్సరాల్లో లక్షన్నర కోట్ల రూపాయలు కావాలన్నారు. హైదరాబాద్ నగరమే మన ఆదాయం, ఆత్మగౌరవం అన్నారు. నగర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నామని, ఆ ప్రణాళికల ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకొచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. న్యూయార్క్, టోక్యో తరహాలో హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తామన్నారు.