సుప్రీంకోర్టుని ఆశ్రయించిన రాహుల్, గుజరాత్ కోర్టు తీర్పుని సవాల్ చేస్తూ పిటిషన్

Rahul Gandhi Defamation Case: 

పరువు నష్టం దావా కేసులో గుజరాత్ హైకోర్టు స్టే పిటిషన్‌ని కొట్టేసిన నేపథ్యంలో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. గుజరాత్ హైకోర్టు తీర్పుని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 2019లో ఎన్నికల ప్రచారంలో మోదీ ఇంటి పేరుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఓ బీజేపీ నేత సూరత్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణ చేపట్టిన కోర్టు రాహుల్‌ని దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. అయితే…ఈ తీర్పుని సవాలు చేస్తూ గుజరాత్ హైకోర్టులో స్టే పిటిషన్ వేశారు రాహుల్. దీనిపై విచారణ చేపట్టిన గుజరాత్ కోర్టు..ఈ పిటిషన్‌ని తిరస్కరించింది. జులై 7న ఈ పిటిషన్‌ని కొట్టేసింది. దీన్ని సవాలు చేస్తూ వారం రోజుల తరవాత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 

Source link