Bus Accident: తిరుపతి జిల్లా సుళ్లూరు పేటలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడటంతో 17మంది గాయపడ్డారు. పాండిచ్చేరి నుంచి విజయవాడ వస్తున్న మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సులో 34మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు బయల్దేరినప్పటి నుంచి డ్రైవర్ వాహనాన్ని ర్యాష్‌గా నడుపుతూ వచ్చాడని, బస్సులో మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారని వారించినా డ్రైవర్ లెక్క చేయలేదని ప్రయాణికులు ఆరోపించారు.