అందరికీ థ్యాంక్స్
రెండో రోజు సెంచరీ తర్వాత యశస్వి మాట్లాడాడు. ఈ సందర్భంగా అతడు కాస్త ఎమోషనల్ అయ్యాడు. “నాకు, నా కుటుంబానికి, నాకు అన్ని విధాలుగా మద్దతిచ్చిన అందరికీ ఇది చాలా ఎమోషనల్ మూమెంట్. ఇది చాలా సుదీర్ఘ ప్రయాణం. నాకు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. దీనికి ఎంతగానో సహకరించిన మా అమ్మానాన్నలకు ఈ సెంచరీ అంకితమిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా చేయాల్సింది చాలా ఉంది” అని యశస్వి అన్నాడు.