సైంధవ్-ఈగల్‌పై SMలో సెటైర్స్

2024 సంక్రాంతి సీజన్ రంజు రంజు‌గా జరగబోతుంది. ఎవ్వరూ తగ్గేదేలే.. అంటున్నారు. ఏ సినిమా కూడా తప్పుకునేదే‌లే అన్నట్లుగా మారింది. డేట్స్ కూడా పక్కాగా ప్రకటించేశాయి. పెద్ద హీరోల సినిమాలకి పెద్దగానే అండదండలు అందుతున్నాయి. చిన్న సినిమా అయిన హనుమాన్ కి పెద్ద రేంజ్‌లో హైపే ఉంది. ఈ సంక్రాంతి కాంపిటీషన్ అయితే గట్టిగానే ఉండబోతుంది. కలెక్షన్స్ పంచుకుంటారనేది కన్ఫర్మ్‌గా ఫిక్సయింది

అయితే ఈ సంక్రాంతి పోటీ మీద సోషల్ మీడియాలో నెటిజెన్స్ మాత్రం వివిధరకాలుగా స్పందిస్తున్నారు. దిల్ రాజే గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ మూడు సినిమాలని నైజామ్ లో రిలీజ్ చేస్తూ థియేటర్స్ పంచిపెట్టే ప్రాసెస్‌లో ఉన్నాడు. అలాగే మైత్రి మూవీస్ వారు సలార్ కి కంటిన్యూషన్ సినిమా హనుమాన్ కి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈగల్ ఏషియన్ సినిమా సునీల్ ప్లాన్ చేస్తున్నాడు. ఇవన్నీ ఇలా ఉంచితే.. అసలు సరైన సంక్రాంతి సినిమా ఏది అనే దానిపై చర్చ వేడిగా జరుగుతుంది. దీనిపై వాదోపవాదాలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. 

సోషల్ మీడియాలో మాత్రం సైంధవ్, ఈగల్ పైనే ఎక్కువ విమర్శలు వినిపిస్తుండటం విశేషం. ఎందుకంటే మహేష్ గుంటూరు కారం పక్కా తెలుగు నేటివిటీ సినిమా. సరైన పండగ సినిమా అంటున్నారు. అలాగే నా సామిరంగా అది కూడా పండగ కలిసొచ్చే సినిమాలా కనిపిస్తుంది. హనుమాన్ వాళ్ళు ముందుగానే చెప్పిన డేట్‌కి ఫిక్స్ అయ్యి ఉన్నారు. డివోషనల్ టచ్ ఉన్న సినిమా కాబట్టి, పండగకి రావడం కరెక్ట్ అనిపిస్తుంది. అందులోనూ అయోధ్య ఆలయ ప్రారంభానికి ముందే హనుమాన్‌ని రంగాల్లోకి దింపడం ఆ మేకర్స్‌కి అనివార్యమైంది. 

ఇక ఈ సినిమాల్లో ఇమడని సినిమాలు, పండగకి అవసరమా అనిపించే సినిమాలుగా మాత్రం సైంధవ్, ఈగల్ కనిపిస్తున్నాయి నెటిజెన్స్‌కి. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలు పండగ మూడ్‌కి పనికొస్తాయా? మంచి డేట్ ప్లాన్ చేసుకోవచ్చు కదా.. ఇంత హెవీ కాంపిటేషన్‌లో దూరడమెందుకు అనే వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. ఆ రెండు సినిమాలకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఫెస్టివల్ మూడ్‌కి తగ్గట్టుగా లేవు. యాక్షన్ థ్రిల్లర్స్ అనే ఫీలింగ్ నే క్రియేట్ చేస్తున్నాయి తప్ప.. గుంటూరు కారంలాగా మాస్ పాటలతో ఊపెయ్యడం లేదు.. నా సామిరంగా సినిమాలా నేటివిటీ చూపిస్తూ సంక్రాంతి సినిమా అనిపించడం లేదు. 

మరి ఆ రెండు యాక్షన్ థ్రిల్లర్స్ మీదే అందరూ పడ్డారు కాబట్టి అవి ఎంతవరకు ఆడియన్స్‌ని శాటిస్‌ఫై చేస్తాయో, ఎటువంటి ఫలితాన్ని పొందుతాయో చూడాలి. ఈ సినిమా ఫలితం ఏమిటి, ఆడియన్స్ లో వీటికి ప్రయారిటీ ఎంత అని సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోల్ పెడితే.. చివరి రెండు స్థానాల కోసం పోటీ పడుతున్నాయి సైంధవ్ మరియు ఈగల్. అంటే ఆడియన్స్ ఎంపిక అలా ఉంది. అంతేకదా మరి పండగ అంటే. పండగ లాంటి సినిమా కావాలి కానీ.. థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్, యాక్షన్ థ్రిల్లర్స్ ఎందుకనుకుంటున్నట్టు ఉంది నెటిజన్లకి.

Source link