సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ బీఆర్ఎస్ రాక్షసానందం పొందుతుంది- కంటతడి పెట్టుకున్న మంత్రి కొండా సురేఖ-hyderabad minister konda surekha emotional brs social media objectionable posts trolling ,తెలంగాణ న్యూస్

మన శరీరాన్ని వస్త్రంతో కప్పుకుని నాగరికులుగా ఎదగానికి, గౌరవప్రదంగా బతకడానికి కారణమైన చేనేతలను అవమానించే విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రవర్తించిందని మంత్రి సురేఖ పేర్కొన్నారు. చేనేతలకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేకపోగా ఇంకా ఇలా అవమానిస్తున్నారని దుఃఖించారు. ప్రభుత్వ విధానాల పరంగా ఎలా విమర్శించినా భరిస్తాం కానీ వ్యక్తిగత ప్రతిష్ట దిగజారేలా ప్రవర్తిస్తే తీవ్ర చర్యలుంటాయని మంత్రి సురేఖ హెచ్చరించారు. ఇలాంటి ట్రోలింగ్స్ ను మీ తల్లి, చెల్లి హర్షిస్తారా అని మంత్రి సురేఖ కేటీఆర్ ను ప్రశ్నించారు. ఇలా చేస్తే కేటీఆర్ బట్టలు ఊడదీసి పరుగెత్తిస్తామని మంత్రి ఘాటుగా స్పందించారు. ఇక పై కాంగ్రెస్ పార్టీ మహిళలపై కానీ, సమాజంలోని ఏ మహిళ జోలికి వచ్చినా తీవ్ర చర్యలు తీసుకుంటామని, అంతుచూస్తామని మంత్రి సురేఖ హెచ్చరించారు. చేనేతలకు బేషరుతుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మంత్రి సురేఖ బీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేశారు.

Source link