స్క్రిఫ్ట్ అంతా అక్కడ్నుంచే….
వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే ఏ కార్యక్రమం చేపట్టినా చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌కు మింగుడుపడదన్నారు సజ్జల. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టునే పవన్ చదువుతాడనేది అందరికీ అర్థమైపోయిందని చెప్పారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం కోసమే తాను పనిచేస్తున్నానని పవన్ కల్యాణ్ పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చినప్పుడే పవన్ దివాళాకోరుతనం అర్థమైపోయిందని కామెంట్స్ చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, కమ్యూనిస్టులు, ఈమధ్య చంద్రబాబు సహకారంతో పార్టీ పెట్టిన జడా శ్రవణ్‌కుమార్ అనే వ్యక్తితో సహా వీరందరికీ అజెండా అంతా ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల నుంచే తయారవుతుందని…ఇదే విషయం స్పష్టంగా అర్థం అవుతుందని ఆరోపించారు.