హరగోపాల్‌తో పాటు ఇతరులపై ‘ఉపా’ కేసు ఎత్తివేత..! సీఎం కేసీఆర్ ఆదేశాలు-telangana police dropped uapa case registered against the intellectuals

గతేడాది కేసు – ఇలా వెలుగులోకి…

ములుగు జిల్లా తాడ్వాయి పోలీ్‌సస్టేషన్‌లో గత ఏడాది ఆగస్టు 19న పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. పెట్టారు. బీరెల్లి గ్రామం వద్ద ఆరోజు తెల్లవారుజామున మావోయిస్టు పార్టీ సభ్యులు కొంతమంది సమావేశామవుతున్నారనే సమాచారంతో పోలీసులు కూంబింగ్‌ చేపట్టారు. సమాచారం తెలుసుకున్న మావోయిస్టులు… అక్కడ్నుంచి తప్పించుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో దొరికిన పత్రాల్లో పలువురు ప్రజాసంఘాల నేతలతో మావోయిస్టులకున్న సంబంధాలపై ఆధారాలు లభించాయంటూ ఉపా కేసును నమోదు చేసినట్లు వెల్లడించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్‌ చంద్రన్నతోపాటు ప్రొఫెసర్‌ హరగోపాల్‌, మరో ప్రొఫెసర్‌ పద్మజాషా, విమలక్క, కోయ్యడ సాంబయ్య, కనకాల రాజిరెడ్డి, కుర్సం మగ్గు, మడకం సనల్, సహా మొత్తం 152 మందిపై 120బీ, 147, 148, రెడ్‌విత్‌ 149 ఐపీసీ, 10, 13, 18, 20, 38 యూఏపీఏ, 25(1-బి)(ఎ) ఆయుధ చట్టం సెక్షన్లు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Source link