హిట్ వచ్చినా పరిస్థితి మారలేదు.

సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం థియేటర్స్ లో మూడు వందల కోట్లు ఈజీగా కొల్లగొట్టేసింది. కారణం ఆ సినిమాకి చేసిన ప్రమోషన్స్. ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ మాత్రమే కాదు, సినిమా రిలీజ్ అయ్యాక కూడా హీరో-హీరోయిన్స్, దర్శకనిర్మాతలు ఈ చిత్రానికి చేసిన ప్రమోషన్స్ వలనే ఆడియన్స్ థియేటర్లకి కదిలారు. 

ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ లేదా ముందుగా టీవీలో వచ్చేందుకు సిద్దమవుతుంది. అయితే ఫిబ్రవరి 7 న థియేటర్స్ లో విడుదలైన తండేల్ చిత్రానికి థియేటర్స్ నుంచి, పబ్లిక్ నుంచి, క్రిటిక్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడంతో టీమ్ మొత్తంగా హ్యాపీగా ఫీలైంది. గబగబా నాగార్జున, శోభితలను పిలిచి సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసేసారు. 

ఆ తర్వాత అక్కడక్కడా కనిపించిన తండేల్ టీమ్ ప్రస్తుతం కామైపోయింది. అయితే తండేల్ విడుదలైన రెండో రోజే పైరసీ బారిన పడింది, అంతేకాదు రెండు వారాలు తిరిగే లోపే తండేల్ హడావిడి థియేటర్స్ దగ్గర తగ్గిపోయింది. అప్పుడే ప్రేక్షకులు తండేల్ ఓటీటీ లోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. 

నాగ చైతన్య తండేల్ మూవీ హిట్ అయినా.. బయట పరిస్థితి ఏమిటి ఇలా ఉంది అంటూ మాట్లాడుకుంటున్నారు నెటిజెన్స్. 

Source link