హైదరాబాద్‌‌లో డబుల్ మర్డర్‌.. యువతి, యువకుడి దారుణ హత్య?-double murder in narsingi of hyderabad has become a sensation ,తెలంగాణ న్యూస్

హైదరాబాద్‌ నగరం నార్సింగ్‌లో డబుల్ మర్డర్‌ సంచలనంగా మారింది. యువతి, యువకుడి దారుణ హత్యకు గురయ్యారు. యువతి, యువకుడిని దుండగులు బండరాళ్లతో మోది చంపేశారు. పద్మనాభస్వామి గుట్టల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో 10 మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించారు డీసీపీ శ్రీనివాస్‌.

Source link