గతంలో సిద్దిపేటలో కూడా
సాధారణంగా దొంగలు నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులు చోస్తుంటారు. సిద్దిపేటలో ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు. సిద్దిపేట బస్ స్టాండ్ లో ఉన్న ఆర్టీసీ బస్సును చోరీ చేశాడో వ్యక్తి. మార్గమధ్యలో డీజిల్ అయిపోవడంతో బస్సును రోడ్డుపై వదిలేసి పరారయ్యాడు. దీంతో ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిద్దిపేట డిపో నుంచి ఆర్టీసీ బస్సును దొంగిలించాడు దొంగ. అక్కడి నుంచి వేములవాడ బస్టాండ్ చేరుకుని హైదరాబాద్ పాయింట్ లో బస్సును పార్క్ చేశాడు. ఈ బస్సు హైదరాబాద్ వెళ్తుందని ప్రయాణికులను నమ్మించి బస్సులో ఎక్కించుకున్నాడు. వేములవాడ నుంచి హైదరాబాద్‌కు బస్సు బయలుదేరింది. కొందరు ప్రయాణికులు టికెట్ తీసుకోమని డ్రైవర్‌ను అడుగగా మధ్య దారిలో కండక్టర్ ఎక్కుతాడని నమ్మించాడు. తంగళ్లపల్లి మండలం సారంపెల్లి నేరెళ్ల గ్రామ శివారులోకి రాగానే బస్సులో డీజిల్ అయిపోయింది. దీంతో ప్రయాణికులను మార్గ మధ్యలోనే వదిలేసి జంప్ అయ్యాడు. ఈ ఘటన సెప్టెంబర్ నెలలో చోటుచేసుకుంది.