ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్నెల్లు రాజకీయాలు చేస్తే చాలని, మిగతా నాలుగున్నరేండ్లు అభివృద్ధి, ప్రజల సంక్షేమం చూడాలని అన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పటికీ వదులుకోరని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరం చుట్టూ 415 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. 24 గంటలూ రాజకీయాలు చేయాల్సిన అవసరంలేదన్నారు. సీఎం కేసీఆర్ వయసుకు కనీసం గౌరవం ఇవ్వకుండా, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న పార్టీలకు బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ అవసరాల దృష్ట్యా 70 కి.మీల మెట్రో రైలు మార్గం ఏర్పాటుచేసుకున్నామని, ఓఆర్‌ఆర్ చుట్టూ 159 కి.మీల మెట్రోకు ప్రణాళికలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు. త్వరగా భూసేకరణ పూర్తి చేసి ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో మార్గాన్ని నాలుగేళ్లలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ చెప్పారు.