Serial Actress Sobhita Shivanna : కన్నడ సీరియల్ నటి శోభిత(32) హైదరాబాద్ లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. గచ్చిబౌలి శ్రీరాంనగర్ కాలనీలోని ఉంటున్న ఆమె, తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శోభిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శోభిత కన్నడ సీరియల్స్ బ్రహ్మగంతు, నినిదలేతో పాటు పలు సినిమాల్లో నటించారు. ఆమె గతేడాది వివాహం చేసుకున్నారు. శోభిత తన భర్త సుధీర్‌తో కలిసి శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. నటి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం అనంతరం శోభిత మృతదేహాన్ని బెంగళూరుకు తరలించనున్నట్టు తెలుస్తోంది.