పార్టీకి నష్టం చేసే వాళ్లపై కచ్చితంగా చర్యలు
మంత్రి పదవి చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా… వేణుగోపాలకృష్ణ వర్గం ఆత్మీయ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం అనంతరం మంత్రి వేణు కీలక వ్యాఖ్యలు చేశారు. మండలి రద్దు అవ్వదని తెలిసి, సుభాష్ బోస్‌ను మంత్రిగా కొనసాగుతావా సీఎం జగన్ అడిగారన్నారు. అయితే తాను రాజ్యసభకు వెళ్తానని పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారన్నారు. పార్టీకి నష్టం చేసే వాళ్లపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో బోస్ ఓడిపోయినప్పటికీ సీఎం జగన్ ఆయనకు ఎమ్మెల్సీ, మంత్రి, ఎంపీ పదవుల్ని ఇచ్చారన్నారు. తోట త్రిమూర్తులు, పిల్లి బోస్ ముందే వచ్చే ఎన్నికల్లో వేణుగోపాలకృష్ణ పోటీ చేస్తారని సీఎం జగన్ వెల్లడించారన్నారు. 2024లోనే కాదు, 2029, 2034లలో కూడా రామచంద్రాపురం నుంచి తానే పోటీ చేస్తానని మంత్రి వేణు స్పష్టం చేశారు.