2024లో పెరిగిన హైదరాబాద్ క్రైమ్ రేట్, రూ.297 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు-hyderabad city annual crime report 2024 first increased to 45 percent cybercrime also ,తెలంగాణ న్యూస్

రూ.297 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

2024లో మొత్తం 35,944 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. గత ఏడాది కంటే ఈసారి 45 శాతం ఎఫ్ఐఆర్ పెరిగాయన్నారు. హత్యలు 13 శాతం తగ్గాయని, అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా తగ్గాయని సీపీ వెల్లడించారు. కిడ్నాప్ కేసులు 88 శాతం, ఆస్తి వివాద కేసులు 67 శాతం పెరిగాయన్నారు. 36 రకాల సైబర్ నేరాలు ఈ ఏడాది చూశామన్నారు. నేరాలను గుర్తించడం 59 శాతం, రికవరీ పర్సెంటేజ్ 58 శాతం ఉందన్నారు. సైబర్ నేరాల్లో డిజిటల్ అరెస్టులు ఎక్కువ శాతం రిపోర్టు అవుతున్నాయన్నారు. కమిషనరేట్ పరిధిలో 4042 సైబర్ క్రైమ్‌ కేసులు నమోదు అయ్యాయన్నారు. సైబర్ క్రైమ్ లో పెట్టుబడుల పేరిట మోసాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. రూ.297 కోట్లు సైబర్ నేరాల్లో బాధితులు పోగొట్టుకున్నారని, రూ.42 కోట్లు రికవరీ చేశామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. 500 మంది కన్నా ఎక్కువ సైబర్ క్రిమినల్స్‌ను అరెస్ట్ చేశామన్నారు.

Source link