3 రోజులే తెలంగాణ ‘అసెంబ్లీ’ సమావేశాలు-monsoon sessions of telangana assembly for three days 2023

3 రోజులే మాత్రమే…

మరికొద్దిరోజుల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… ఈసారి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలే చివరివి. అయితే దాదాపు 15 నుంచి 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తారని అంతా భావించారు. కానీ మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ప్రభుత్వం తరఫున మంత్రులు హరీశ్‌ రావు, ప్రశాంత్‌ రెడ్డి ఈ భేటీ పాల్గొనగా… కాంగ్రెస్‌ నుంచి భట్టి విక్రమార్క, ఎంఐఎం తరఫున అక్బరుద్దీన్‌ ఒవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించాలని విపక్షాలు కోరాయి. 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రధానంగా కోరింది. అయితే పని దినాలు కాదు, పని గంటలపై చూడాలని ప్రభుత్వం తరపున ఉన్న మంత్రులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం దాదాపు పది బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. శుక్రవారం వరదలు, శనివారం పలు బిల్లులపై చర్చించే అవకాశం ఉంది.

Source link