30 people were killed and 90 injured in the Mahakumbh Mela stampede Uttar Pradesh DGP announced | Mahakumbh Mela Stampede: మహాకుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి

Mahakumbh Mela Stampede: మహాకుంభ్ 2025లో మౌని అమావాస్య రోజున అమృత స్నానం చేసేందుకు ప్రయాగ్‌రాజ్‌కు కోట్ల మంది భక్తుల తరలి వచ్చారు. ఈ టైంలో మంగళవారం అర్థరాత్రి తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటపై ఇప్పటి వరకు రకరకాలుగా ప్రచారం జరిగింది. జరుగుతున్న దుష్ప్రాచారానికి అడ్డుకట్టే వేసేందుకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. జరిగిన దుర్ఘటనపై కుంభ్‌ డీఐజీ వైభవ్‌ కృష్ణ కీలక ప్రకటన చేశారు. 

ప్రధానితోపాటు ప్రముఖుల సంతాపం 

కుంభ్‌లో జరిగిన ఘోర ప్రమాదంపై ప్రధానమంత్రి మోదీ సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం టచ్‌లో ఉందని పరిస్థితి అందుపులోనే ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ ఘటన తనను ఎంతగానో కలచివేసిందన్నారు హోంమంత్రి అమిత్ షా. తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధను భరించే శక్తిని దేవుడు కల్పించాలని ఆకాంక్షించారు. 

Also Read: మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన – భారత్‌లో ఊహకందని ఆధ్యాత్మిక విషాదాలివే!

నాలుగు కోట్ల మంది పుణ్యస్నానాలు

బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు 10 లక్షల మంది కల్పవాసులతో సహా 4.24 కోట్ల మంది ప్రజలు పవిత్ర సంగమంలో స్నానాలు చేశారు. ఈ మహా జాతర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 19.94 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న సాధువులపై ప్రభుత్వ యంత్రాంగం పూలవర్షం కురిపించింది. 

ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన రైల్వే శాఖ 

భారీగా భక్తులు ప్రయాగ్‌రాజ్‌ నుంచి వారి స్వస్థలాలకు క్షేమంగా చేరేందుకు అన్ని ఏర్పాటు చేసినట్టు నార్త్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. రద్దీకి సరిపడా రైళ్లు ఏర్పాటు చేశామని పేర్కొంది. ఇతర ప్రాంతాల నుంచి ప్రయాగ్‌రాజ్‌ వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు లేవని వాటన్నింటినీ ప్రయాగ్‌రాజ్‌ నుంచి తిరుగు పయనమయ్యే వారి కోసం కేటాయించినట్టు తెలిపింది. దాదాపు 50 ఉత్తర మధ్య రైల్వేలు, 13 ఉత్తర రైల్వేలు, 20 ఈశాన్య రైల్వేల ద్వారా మొత్తం 80 కంటే ఎక్కువ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు వివరించింది. ఈ ఒక్కరోజే 190 ప్రత్యేక రైళ్లను నడపబోతున్నారు. 

Also Read: కలియుగ శ్రవణుడు – చెక్క బండిపై 92 ఏళ్ల తల్లిని మోస్తూ, కాలి నడకన కుంభమేళాకు – సంగంలో స్నానం చేయాలని సంకల్పం

మరిన్ని చూడండి

Source link