3000 Year Old Bronze Sword Found In Germany, The Glow Remains Intact Till Today Says Archaeologists

Bronze Sword:

జర్మనీలో బయట పడ్డ ఖడ్గం..

ఆర్కియాలజిస్ట్‌లో 3 వేల ఏళ్ల నాటి అరుదైన కంచు ఖడ్గాన్ని వెలికి తీశారు. ఐరోపా దేశమైన జర్మనీలో ఈ ఖడ్గం వెలుగులోకి వచ్చింది. ఇన్నేళ్లైనా ఇప్పటికీ అది చెక్కు చెదరలేదు. పైగా…కొత్త దానిలా మెరుస్తోంది. 3 వేల ఏళ్లకుపైగానే చరిత్ర ఉన్న ఖడ్గం అని ఆర్కియాలజిస్ట్‌లు వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ ఖడ్గం ఎవరిది..అని పెద్ద డిస్కషన్ జరుగుతోంది. దీనికి సంబంధించిన మరి కొన్ని వివరాలు శాస్త్రవేత్తలు తెలిపారు. జర్మనీలోని నార్డ్‌లింగెన్ (Nördlingen) సిటీలో జరిగిన తవ్వకాల్లో ఇది బయట పడింది. దీనిపై బవారియన్ స్టేట్ ఆఫీస్ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ మాన్యుమెంట్స్ (Bavarian State Office for Preservation of Monuments) అధికారికంగా ఓ స్టేట్‌మెంట్ విడుదల చేసింది. 14వ శతాబ్దానికి చెందిన ఖడ్గం అని తేల్చి చెప్పింది. ఇప్పటికీ మెరిసిపోతోందని వెల్లడించింది. ఈ ఖడ్గం దొరికిన ప్రాంతంలోనే ఓ మహిళ, పురుషుడు, బాలుడి ఎముకలు కనిపించాయి. అంతే కాదు. మరి కొన్ని కంచు వస్తువులనూ గుర్తించారు. ఇలాంటి ఖడ్గాల్ని ఇప్పుడు తయారు చేయడం సాధ్యం కానే కాదని తేల్చి చెప్పారు ఆర్కియాలజిస్ట్‌లు. డిజైన్‌ చాలా అరుదుగా ఉందని, ఎవరినైనా ఒకే ఒక వేటుతో చంపేయగలదని వివరించారు. అయితే…ఈ ఖడ్గాన్ని చూసిన కొందరు ఇండియన్స్..భారత దేశ చరిత్రకు దీన్ని ముడి పెడుతున్నారు. వేలాది ఏళ్ల క్రితం భారత్‌లోని రాజులు, చక్రవర్తులు ఇలాంటి ఖడ్గాలనే వాడినట్టు చెబుతున్నారు. భారత్‌లో శతాబ్దాల పాటు కంచు వస్తువులను వినియోగించినట్టు గుర్తు చేస్తున్నారు. మొహంజదారో, హరప్పా నాగరికతల గురించి ప్రస్తావిస్తున్నారు. 

Source link