Several Accused Arrested In Kerala Athlete Abused Case: కేరళలో (Kerala) ఓ అథ్లెట్‌పై దాదాపు 60 మంది లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ 44 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 30 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశామని.. నిందితుల్లో ఇద్దరు విదేశాల్లో ఉన్నట్లు గుర్తించామని డీఐజీ ఎస్.అజీతా బేగం తెలిపారు. విదేశాలకు వెళ్లిన నిందితులకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని.. ఇంటర్‌పోల్ సాయంతో రెడ్ కార్నర్ నోటీసులు పంపేలా ప్రణాళిక రచిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో 13 మంది ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నామని వెల్లడించారు. నిందితులు ఎవరినీ వదిలిపెట్టేది లేదని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సిట్ పక్కా ఆధారాలతో విచారణ సాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read: Maha Kumbh 2025: అస్వస్థతకు గురవుతున్న కుంభమేళాలో పాల్గొన్న భక్తులు – కారణాలు ఏంటంటే
ఐదేళ్లుగా దారుణం
పలువురు నిందితులు బాధితురాలిని పథనంథిట్టలోని ఓ ప్రైవేట్ బస్టాండులో కలిసినట్లు తెలిసింది. ఆమెను వాహనాల్లో ఎక్కించుకుని పలు ప్రాంతాలకు తిప్పుతూ లైంగికంగా వేధించినట్లు పోలీసులు గుర్తించారు. గతేడాది ఆమె 12వ తరగతి చదువుతున్న సమయంలో ఓ యువకుడు ఇన్ స్టా ద్వారా పరిచయమయ్యాడు. అతను బాధితురాలిని ఓ రబ్బరు తోటలోకి లాక్కెళ్లి మరో ముగ్గురితో కలిసి అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆమెపై 5 ప్రాంతాల్లో అత్యాచారాలు జరిగాయని పోలీసులు తెలిపారు. ఇందులో కొన్ని కార్లలో జరిగాయని.. మరో ఘటన 2024 జనవరిలో పథనంథిట్ట ప్రభుత్వాస్పత్రి వద్ద జరిగిందని పేర్కొన్నారు. బాధితురాలికి ఇప్పుడు 18 ఏళ్లు కాగా.. ఐదేళ్లుగా ఈ దారుణాలు అనుభవిస్తూ వచ్చి.. చివరకు శిశు సంక్షేమ కమిటీ నిర్వహించిన కౌన్సెలింగ్‌లో తన ఆవేదనను చెప్పడంతో విషయం బయటకొచ్చింది. దీనిపై పథనంథిట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని ప్రస్తుతం షెల్టర్ హోంకు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని.. ఆమెకు అన్ని విధాలా అండగా ఉంటామని ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ తెలిపింది.
13 ఏళ్ల వయసులోనే తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. పొరుగింట్లో ఉన్న ఓ వ్యక్తి తనను కొండల్లోకి తీసుకెళ్లి, స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది. ఆ తర్వాత పలువురు కోచ్‌లు, తోటి ఆటగాళ్లు కూడా పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చెప్పింది. భయంతోనే ఇన్నాళ్లు ఈ విషయం బయటకు చెప్పలేదని వెల్లడించింది. దీంతో 30 మంది అధికారులతో సిట్ ఏర్పాటు కాగా.. శబరిమల యాత్ర రద్దీ తగ్గిన తర్వాత మరికొందరు అధికారులకు ఈ విచారణ కమిటీలో చోటు కల్పిస్తామని డీఐజీ అజీతా బేగం వెల్లడించారు. మొత్తం.. 62 మంది అనుమానితులను గుర్తించగా వీరిలో 40 మందిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.
Also Read: Notices to Zuckerberg: జుకర్ బెర్గ్‌కు ఎంత దైర్యం – బీజేపీ ఓడిపోయిందని ఫేక్ ప్రచారం – నోటీసులు ఇచ్చిన పార్లమెంటరీ కమిటీ !
మరిన్ని చూడండి