47 Workers Feared Trapped In Uttarakhand Avalanche Rescue Efforts On | Uttarakhand : బద్రీనాథ్‌లో విరిగిపడిన మంచు చరియలు

Uttarakhand Avalanche: ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ లో రోడ్డు పనులు చేస్తున్న వారు పెనుప్రమాదానికి గురయ్యారు. మంచు చరియలు ఒక్క సిరాగి విరిగిపడటంతో 57 మంది చిక్కుకున్నారు. వారిలో పది మంది కార్మికులను అతి కష్టం మీద రక్షించారు. మరో 47 మంది కోసం .. రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. 

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఒక్క సారిగా హిమపాతం సంభవించి  ఇండో-టిబెటన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న మానా గ్రామంలో 57 మంది కార్మికులు  మంచు కింద చిక్కుకుపోయారు.  బద్రీనాథ్ ధామ్‌కు 3 కి.మీ దూరంలో, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) క్యాంప్ సమీపంలో జరిగింది. కార్మికులు రోడ్డు నిర్మాణంలో  భాగంగా అక్కడ పని చేస్తున్నారు. అంబులెన్స్‌లను సంఘటనా స్థలానికి పంపినా..   భారీ హిమపాతం కారణంగా ఆలస్యం జరిగింది.  బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఈ రోడ్లను నిర్మిస్తోది. దాదాపుగా అరవై మందితో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), జిల్లా పరిపాలన, ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు (ITBP),  BRO బృందాలు సంఘటనా స్థలంలో ఉండి… మంచులో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. 



హిమపాతంతో బాధపడ్డ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కార్మికులంతా క్షేమంగా ఉండాలని ప్రార్థించారు.  



భారత వాతావరణ శాఖ (IMD) ఉత్తరాఖండ్‌తో సహా అనేక కొండ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది, శుక్రవారం అర్థరాత్రి వరకు  అతి భారీ వర్షాలు కురుస్తాయన అంచనా వేసిది.



ఒక్క ప్రాణం కూడా పోకుండా ..  కాపాడేందుకు  రెస్క్యూ టీమ్స్ ప్రయత్నిస్తున్నాయి. 

మరిన్ని చూడండి

Source link